ETV Bharat / state

రుణ మాఫీ పక్కా... తేలాలి లెక్క

author img

By

Published : Mar 15, 2020, 1:33 PM IST

రుణమాఫీపై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వల్ల ఇక విడతల వారీగా పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. గతంలో మాదిరే నాలుగు విడతల్లో ఇచ్చే అలోచన చేస్తోంది. ఇంతకు ముందులాగా 1/4 వంతు కాకుండా రుణ పరిమితి ఆధారంగా లబ్ధిదారులకు అందించాలని భావిస్తోంది.

arrangements for loan waiver for farmers in telangana
రుణ మాఫీ పక్కా... తేలాలి లెక్క

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్​లో రుణమాఫీకి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇక విడతల వారీగా పంపిణీ చేసేందుకు సర్కార్​ రంగం సిద్ధం చేస్తోంది. నాలుగు విడతల్లో ఇచ్చే యోచనలో ఉంది. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా నుంచి సుమారు 4.20 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 1800 కోట్ల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు అధికారికంగా తమకెలాంటి సమాచారం లేదని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జయశంతన్‌, జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇచ్చే మార్గదర్శకాలను బట్టి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తామని పేర్కొంటున్నారు.

2014 జూన్‌ 2న సీఎం కేసీఆర్‌ మొదటిసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే రైతుకు రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో 25 శాతం చొప్పున వర్తింపజేస్తామని వెల్లడించారు. ఈ లెక్కన నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లాలో 3,78,791 మంది రైతులకు రూ. 1,573.60 కోట్లు మాఫీ చేశారు. ఈ సారి 2018, డిసెంబరు 11 నాటికి రుణం పొందిన రైతులను అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తామని వెల్లడించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సారి సుమారు 4.20 లక్షల మంది రైతులకు రూ.1,800 కోట్ల వరకు రుణవిముక్తి జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

లక్ష మందికే ముందు..

ముందుగా చిన్న, సన్నకారు రైతులకు మాఫీ వర్తింపజేయాలని సర్కారు యోచిస్తోంది. ప్రధానంగా రూ. 25 వేల లోపు రుణం ఉన్నవారికి ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో వీరు దాదాపు లక్ష మంది ఉంటారు. వీరికి ఈ నెలాఖరుకు చెక్కుల రూపంలో ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత రూ. 50 వేలు, రూ.75 వేలు, రూ. లక్ష లోపు ఉన్నవారికి విడతల వారీగా ఎంపిక చేసి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రూ. 75 వేలకు పైగా ఉన్నవారు కనీసం మూడేళ్లు ఆగితేనే రూ. లక్ష వరకు మినహాయింపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

వేర్వేరు ప్రయోజనాలు..

మాఫీ నిబంధన ఉభయ జిల్లాల్లో వేర్వేరు ప్రయోజనాలు ఇస్తోంది. నిజామాబాద్‌ జిల్లా విషయానికొస్తే చిన్న కమతాలే ఎక్కువ. రెండున్నర ఎకరాల్లోపు ఉన్నవారు 68 శాతం మంది ఉంటారు. వీరిలో ఎక్కువ మంది రూ.25,000-50,000 రుణ పరిమితిలోకి వస్తారు. కామారెడ్డి జిల్లాలో పెద్ద కమతాల రైతులు ఎక్కువ మంది ఉంటారు. కనీసం ఐదు శాతం మంది కూడా మొదటి విడతలో మాఫీ అయ్యే పరిస్థితి లేదు. మొదటి రెండు విడతల్లోనూ పది శాతం మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందదు.

మార్గదర్శకాలకు అనుగుణంగానే..

రుణమాఫీపై ఇచ్చిన హామీ అమలుకు ఏడాదిన్నర తర్వాత ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో ఎలాగైనా ప్రయోజనం చేకూరుతుందని రైతులు విశ్వసిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఇంకా మార్గదర్శకాలు రాలేదని నిజామాబాద్‌ జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జయశంతన్‌ చెప్పారు. సీఎల్‌బీసీ ఇచ్చే ఆదేశాలకనుగుణంగా బ్యాంకుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తామన్నారు. లబ్ధిదారుల జాబితా తాము కూడా సేకరించలేదని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.