ETV Bharat / state

ఆర్మూర్- ఆదిలాబాద్ రైలు మార్గం.. తీరని కలేనా? - armur adilabad train way construction postponement

ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్న ఆర్మూర్‌- ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ పనులు పట్టాలెక్కలేకున్నాయి. ఈ ప్రాంతాల వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టాలనుకోవడమే సంకటంగా మారినట్లు తెలుస్తోంది.

postponement of arumr adilabad railway construction
ఆర్మూర్- ఆదిలాబాద్ రైలు మార్గం.. తీరని కలేనా?
author img

By

Published : Jul 20, 2020, 1:54 PM IST

నిజామాబాద్‌లోని ఆర్మూర్‌ నుంచి ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ ఏర్పాటైతే జిల్లావాసులు వాణిజ్య, విద్య, వ్యవసాయ సంబంధ పనుల కోసం ఆదిలాబాద్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది. కొన్నాళ్ల కిందట ఈ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో రూ.2800 కోట్లతో చేపడతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

పటాన్‌చెరువును పక్కనపెట్టినా...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు రైళ్లో హైదరాబాద్‌ వెళ్లాలంటే మహారాష్ట్ర నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని గతంలో ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌చెరు దాకా రైలుమార్గం ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. 2009- 10లో కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌, ఆర్మూర్‌ మీదుగా పటాన్‌చెరువు దాకా రైలుమార్గాన్ని మంజూరు చేసింది.

రూ.3,771 కోట్ల వ్యయంతో 317 కిలోమీటర్ల రైలుమార్గం ఏర్పాటు చేయాలనుకున్నారు. నిధుల కేటాయింపులో జాప్యంతో మరుగున పడిపోయింది. ఈలోపు నిజామాబాద్‌ నుంచి పెద్దపల్లి దాకా రైల్వేలైన్‌ పనులు పూర్తికావడం, రైళ్లు కూడా నడుస్తున్నందున ఆదిలాబాద్‌- ఆర్మూర్‌ రైల్వేలైన్‌ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ మార్గం ఏర్పాటైతే ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు ఆర్మూర్‌, నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లవచ్చు.

మూడేళ్లుగా ముందుకెళ్లకుండా

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం రాష్ట్రంలో చేపట్టనున్న రైలుమార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించాల్సి ఉంది. ఆర్మూర్‌- ఆదిలాబాద్‌ రైలుమార్గం వ్యయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించాలి. సగం వరకు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెండేళ్ల కిందటే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభును కలిసి వివరించారు.

పనుల్లో మాత్రం మూడేళ్లుగా ఒక అడుగు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం లేదని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్‌మల్యా కొన్నినెలల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో తెలిపారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో మరోసారి చర్చిస్తామని పేర్కొన్నారు.

ప్రగతికి ఊతం

ఈ ప్రాజెక్టుతో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బాల్కొండ, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌, ముథోల్‌ ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. జిల్లా వాసులకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, ఇతర ప్రాంతాలతో వ్యాపార సంబంధాలున్నాయి. వ్యవసాయోత్పత్తుల ఎగు, దిగుమతులకు అవకాశముంటుంది. ఆర్మూర్‌ ప్రాంతం రైతులు పండించే సంకరజాతి విత్తనాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండు ఉంది. అక్కడి విత్తన కంపెనీల వారు ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ, మొక్కజొన్న, వరి విత్తనాలను వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ నేపథ్యంలో రైలుమార్గం ఏర్పాటైతే విద్య, వాణిజ్య, జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి.

దశాబ్దాలుగా నెరవేరని స్వప్నం

  • దశాబ్దాల కిందట చేపట్టిన నిజామాబాద్‌- పెద్దపల్లి రైలుమార్గం పనులు ఎట్టకేలకు రెండేళ్ల కిందట పూర్తయ్యాయి.
  • ప్రస్తుతం నిజామాబాద్‌- కరీంనగర్‌ ప్యాసింజర్‌ రైలుతో పాటు కరీంనగర్‌- ముంబయి వారాంతపు రైలు నడుస్తోంది.
  • ఇంకా రైళ్ల సంఖ్య పెంచితే ఆర్మూర్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌ ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
  • ఆర్మూర్‌- ఆదిలాబాద్‌ రైలుమార్గం మాత్రం పలు దశాబ్దాలుగా నెరవేరని స్వప్నంలా ఉండిపోయింది.
  • మాజీ ఎంపీ కవిత గతంలో ఈ రైలుమార్గం కోసం పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసి ప్రస్తావించారు. ప్రస్తుత ఎంపీ అర్వింద్‌ సైతం త్వరగా పనులు చేపట్టాలని కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.