ETV Bharat / state

అనిశాకు పట్టుబడిన మరో అధికారి - latest news on acb rides at in nizamabad

నిజామాబాద్​ రూరల్ జిల్లాలోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 1500 రూపాయలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ అధికారిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Another officer caught by Anisha
అనిశాకు పట్టుబడిన మరో అధికారి
author img

By

Published : Dec 7, 2019, 11:00 AM IST

నిజామాబాద్ రూరల్​ జిల్లా కేంద్రంలోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దస్తావేజు లేకరి కృష్ణ ప్రసాద్​ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు అధికారులు కార్యాలయంలో సోదాలు జరిపారు.

కృష్ణ ప్రసాద్​ వద్ద రూ.1500 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇంఛార్జీ సబ్​ రిజిస్ట్రార్​ శ్రీధర్, అతనికి ఏజెంట్​గా పనిచేస్తోన్న సంతోష్​ అనే ఇద్దరు వ్యక్తులను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.

గత నెల 29న మక్లూర్​ మండలానికి చెందిన కేతావత్​ రమేశ్​, కేతావత్​ రెడ్డి, కేతావత్​ రాణిలు కొత్తగా కొన్న భూమి దస్తావేజుల విషయంలో కృష్ణప్రసాద్​ను కలిశారు. వివరాలను దస్తావేజు లేకరి ఆన్​లైన్​లో నమోదు చేశారు. ఆ మూడు దస్తావేజులకు రూ.3000 రూపాయలు లంచంగా ఇస్తేనే... పని పూర్తవుతుందని.. లేని పక్షంలో వాటిని పక్కన పెడతానని సబ్​ రిజిస్ట్రార్​ శ్రీధర్​ చెప్పారు. చివరకు రూ. 1500 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కృష్ణ ప్రసాద్​ అనిశా అధికారులకు సమాచారం అందించారు.

అనిశాకు పట్టుబడిన మరో అధికారి

ఇదీ చూడండి : నిందితుల దాడిలో ఎస్సై, కానిస్టేబుల్​కు గాయాలు: సీపీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.