ధాన్యం కొనుగోలు సరళిని పరిశీలించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ నిజామాబాద్ కేంద్రానికి వచ్చారు. ధాన్యం కొనుగోళ్లు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోళ్లపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యార్డులోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లింపులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుంది: అకున్ సబర్వాల్
నిజామాబాద్‌లోని కొనగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షించారు. కొనుగోళ్ల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.