ETV Bharat / state

NZB Govt Hospital: రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన.. విచారణలో ఏం తేలిందంటే..? - NZB Govt Hospital incident

Nizamabad Government Hospital: నిజామాబాద్​ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటనపై డీఎంఈ విచారణ చేపట్టారు. ఈ విషయంలో ఎవరు తప్పు చేశారో తెలుసుకొనేందుకు వీడియోలను పరిశీలించారు.

Government Hospital in Nizamabad
Government Hospital in Nizamabad
author img

By

Published : Apr 17, 2023, 8:09 PM IST

Nizamabad Government Hospital: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటనపై విచారణ పూర్తయింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు డీఏంఈ రమేశ్ రెడ్డి ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. కమిటీ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు ప్రొఫెసర్ల కమిటీ సభ్యులు ఆసుపత్రి వర్గాలతో చర్చించారు. ఈ నెల 15న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని నేలపై ఈడ్చుకెళ్లినట్లు బయటకి వచ్చిన వీడియోలను కమిటీ సభ్యులు పరిశీలించారు.

రిపోర్ట్​ ఎవరికి ఇవ్వనున్నారు: రోగికి సంబంధించి వివరాలపై డీఎంఈ తనిఖీ బృందం ఆసుపత్రి సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ ఇద్రీస్ ఖాన్ ఆదిలాబాద్ మెడికల్ కళాశాల నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో కలియతిరిగారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. విచారణ చేసిన రిపోర్ట్​ను రాష్ట్ర వైద్య శాఖకు అందజేస్తామని విచారణ అధికారి తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే: నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల బయటకు వచ్చింది. ఆ వీడియోలో రోగిని ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్తున్నట్లు ఉంది. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఎవరెవరు స్పందించారు.. ఏమన్నారు: ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్​ అవ్వడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు స్పందించారు. ఇలా జరగడానికి కారణాలు ఏముంటాయని.. అసలు ఎందుకు ఆ తప్పిదం జరిగిందని.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని.. అందుకే విచారణకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ సైతం స్పందించారు. ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. సిబ్బంది రోగులను పట్టించుకోలేదన్న విషయం అవాస్తమని.. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పొగొట్టేందుకే ఇలాంటి వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ప్రజలందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఇలాంటి ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.