నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపురానికి చెందిన ఆర్మీ జవాన్ (Jawan) మృతిచెందారు. గ్రామానికి చెందిన దాదన్నగారి వెంకట్రావు, వనజ దంపతుల కుమారుడు కల్యాణ్ రావు... ఆరేళ్ల కిందట ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడు.
సైన్యంలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న కల్యాణరావు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని పట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు టెలిఫోన్ స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మృతదేహం వెంకటాపూర్ రానుంది. వెంకటాపూర్లో శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు