ETV Bharat / state

బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్​ షా

Amit Shah Public Meeting in Armoor : తెలంగాణలో ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో పోలింగ్ సమయం దగ్గరపడటంతో బీజేపీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రచారంలో భాగంగా.. ఆర్మూర్​లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అధికార పార్టీ బీఆర్ఎస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

BJP Election Campaign in Telangana
Amit Shah Public Meeting in Armoor
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 3:08 PM IST

Updated : Nov 24, 2023, 6:30 PM IST

Amit Shah Public Meeting in Armoor : తెలంగాణలో ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం పసుపు బోర్డు(Turmeric board) ఏర్పాటు చేస్తోందని.. బోర్డు ద్వారా పసుపు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. పసుపు ఎగుమతులతో పాటు పరిశోధనలు జరుగుతాయని వివరించారు.

PM Narendra Modi Telangana Tour : ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెలలో తెలంగాణకు ప్రధాని మోదీ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా ఆర్మూర్​లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. నిజామాబాద్‌ బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాదిగా గల్ఫ్‌(Gulf Country), విదేశాలకు వలస వెళ్తున్నారన్న షా.. వలస వెళ్లే కార్మికుల కోసం ఎన్‌ఆర్‌ఐ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని చెప్పారు.

Amit Shah Fires on KCR : కేసీఆర్‌ సర్కార్​పై షా విరుచుకు పడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని.. కానీ కేటీఆర్ కోసం మాత్రం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓవైసీ కి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) నిర్వహించడం లేదన్నారు. దళిత సీఎం చేస్తామని కేసీఆర్ చెయ్యలేదని.. బీజేపీ వస్తే బీసీని సీఎం చేస్తామన్నారు. రూ.3100 కి క్వింటా చొప్పున ధాన్యం కొంటామన్నారు. ఫసల్ బీమా యోజన ప్రీమియంను బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేపర్ లీకేజీ నిందితులను కచ్చితంగా జైలుకు పంపుతామన్నారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

అవినీతి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను జైలుకు పంపిస్తాం. బీఆర్ఎస్ సర్కార్‌ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకేతాటి పార్టీలు. ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను దోచుకోవాలని ప్లాన్ వేస్తున్నాయి. - అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి

బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్​ షా

BJP Election Campaign in Telangana : ఆర్మూరు బీఆర్ఎస్ నాయకులు బస్ డిపో భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. బస్సు డిపో భూమి కబ్జా చేసి షాపింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని.. షాపింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన నేతకు బీఆర్ఎస్ టికెట్‌ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS Party) టికెట్‌ కోసం కూడా డీలింగ్‌ ఉంటుందని ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం- ఆరు సభలు, హైదరాబాద్​లో రోడ్​ షో, షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి : అమిత్‌ షా

Last Updated : Nov 24, 2023, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.