Allegations on MLA Jeevanredddy: నిజమామాబాద్ జిల్లాలోని మక్లూర్ మండలం ముల్లంగి గ్రామ సర్పంచ్ పావని భర్త.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతని అనుచరులతో తమను బెదిరిస్తున్నారని.. మాట వినకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు.. తన వ్యాపారాలపై ఎమ్మెల్యే పోలీసులతో దాడులు చేయించారని ముల్లంగి సర్పంచ్ భర్త శ్యామ్‌రావు ఆరోపించారు.
బొంకన్ పల్లి, ముల్లంగి లిఫ్ట్ మంజూరు చేయాలని.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎప్పటినుంచో అడిగామని.. ఆయన కూడా చేస్తామని కాలం వెల్లదీశారని శ్యామ్‌రావు తెలిపారు. ఆలోపే జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ఇరుగ్రామాలకు లిఫ్ట్‌ను మంజూరు చేయించారని తెలిపారు. అందుకు గానూ రెండు గ్రామాల ప్రజలు జడ్పీ ఛైర్మన్‌ను సన్మానించామని తెలిపారు. ఆ కక్షతోనే ఎమ్మెల్యే అనుచరులు తమను బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా లేకుంటే ఆర్థికంగా, భౌతికంగా దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని.. తాము భయపడేదే లేదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆ పది మంది సంపదతో పిల్లలందరికీ 25 ఏళ్లు విద్య ఫ్రీ!