కరోనా వైరస్ నివారణ కోసం కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్, బోధన్ నుంచి వచ్చే వాహనాలు కామారెడ్డి జిల్లాలోనికి రాకుండా చుట్టూ ఉన్న రహదారులను మూసివేశారు. నసురుల్లాబాద్ మండలం కామారెడ్డి జిల్లా సరిహద్దులోని మార్గం ద్వారా రాకపోకలు బంద్ చేశారు.
నిజామాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఈ చెక్‌పోస్ట్ లాక్డౌన్ ఎత్తివేసేవరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల..ఎట్టి పరిస్థితుల్లోనూ కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించరాదని అని ఆయన వెల్లడించారు.