కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ఆరోపించారు. నిజామాబాద్‌లోని తెదేపా కార్యాలయంలో విపక్షనేతలు సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి... ఉపాధి కల్పనలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
కొవిడ్ సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ నియోజకవర్గ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు యాద గౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, సీపీఐ నాయకుడు ఓమయ్య, టీజేఏసీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.