ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంవల్ల అన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. నిజామాబాద్ నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మెండోరా, నవీపేట్, నందిపేట్, బోధన్, కోటగిరి మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది.
సీజన్ ప్రారంభంలోనే వానలు
కామారెడ్డి జిల్లాలో మద్నూర్, లింగంపేట్, బిచ్కుంద, జుక్కల్‌లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంవల్ల ఈ సారి వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే వానలు పడుతున్నాయి. తొలకరి పలకరింపుతో రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్‌కు లేఖ