నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్లో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఓమయ్య డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే బేసిక్‌ను కాంట్రాక్ట్ కార్మికులకూ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.నర్సింగ్‌రావు, యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు పి.సుధాకర్, నాయకులు చిన్నుభాయ్, సావిత్రి, నర్సమ్మ, మల్లేశ్, రాజశేఖర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.