రాష్ట్రంలోని ఏర్పాటు చేయబోతున్న ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిలో చదివేవారికి అవేమీ వర్తించవని చెబుతోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయ సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గసభ్యులు రాజన్న, ఎస్ఎఫ్ఐ కార్యదర్శులు అనిల్, విగ్నేశ్, పీడీఎస్యూ నాయకులు సాయికృష్ణ, ఎన్ఎస్యూఐ నాయకులు సాయి, ఎఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి రంజిత్, నగర నాయకులు వినయ్, రమేశ్ పాల్గొన్నారు.