అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ డిమాండ్ డే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ లోన్ మాఫీ చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడిని అరికట్టాలని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా సమయంలో కూడా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ అధ్యక్షురాలు అంజలి డిమాండ్ చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమే అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యా సంవత్సరం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, జిల్లా నాయకులు సుమన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్