ETV Bharat / state

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టరేట్​ ఎదుట ధర్నా - nizamabad district news

ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మీడియాలో పనిచేస్తున్న వారికి 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.

aikms leaders protest in nizamabad district
జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టరేట్​ ఎదుట ధర్నా
author img

By

Published : Jun 9, 2020, 7:56 PM IST

కరోనా విపత్కర సమయంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. అఖిల భారత రైతుకూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు, తదితర సిబ్బందికి ఒక్కొక్కరికి 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభాకర్​ కోరారు. కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలన్నారు. అలాగే ప్రతి జర్నలిస్టు కుటుంబానికి కరోనా ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, తదితర ప్రభుత్వ సిబ్బందితో పాటుగా పనిచేస్తున్న పాత్రికేయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: వెల్​నెస్​ సెంటర్​లో నిలిచిపోయిన వైద్య సేవలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.