ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి వెల్లడించారు. మీసేవ కేంద్రాల్లో వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
నవంబర్ రెండో తేదీ నుంచి జిల్లాలోని అన్ని తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తారని తెలిపారు. వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.