అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. నిజామాబాద్ విద్యుత్ భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఎస్ఈకి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అధికంగా వేసిన విద్యుత్ బిల్లులు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్