లాక్డౌన్ వేళ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నాకతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు స్కార్పియో వాహనంలో కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున నాక తండా వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆనేశ్ (32), స్టాలిన్(21), అనాలియా(15) మృతి చెందారు. బాధితులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. బిహార్ రాష్ట్రంలోని నౌడా ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్తూ ఇలా మృత్యువాత పడ్డారు.
ఇవీ చూడండి: తెలంగాణలో 4 డేంజర్ జోన్లు..అవి ఏంటో తెలుసా..!