ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది. జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్, అర్గుల్, మనోహరాబాద్, తొర్లికొండ శివారు ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. రహదారి, రైల్వే, ఇతర సౌకర్యాలపై ఆరాతీశారు. భౌగోళిక పరిస్థితులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. ఎయిర్పోర్టు కోసం సుమారు 850 ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. పదేళ్లుగా ఎయిర్ పోర్టు కోసం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారన్నారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రికి మురికినీటి పార్సిల్ పంపిందెవరు..?