నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన ఇమ్మడి సంధ్య(23) నిండు గర్భిణిగా ఉన్న సమయంలో కొవిడ్ బారిన పడింది. శ్వాస ఇబ్బందిగా మారడంతో మొదట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరిన మరునాడు పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది సంధ్య. తర్వాత వెంటిలేటర్‌పైనే తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచింది. పెళ్లైన రెండేళ్ల తర్వాత తల్లిగా మారనున్నట్లు తెలిసి మురిసిపోయిన ఆ యువతి తన కుమారుడిని తనివితీరా చూడకుండానే తనువు చాలించింది.
ఇదీ చదవండి: స్పుత్నిక్-వి టీకా తొలి డోసు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్