ETV Bharat / state

ఈతకు వెళ్లి చెరువులో పడి పదేళ్ల బాలుడి మృతి - ఈతకు వెళ్లి పదేళ్ల బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గంగి చెరువులో మేనమామతో కలిసి స్నానానికి వెళ్లిన పదేళ్ల బాలుడు గురువారం ఈత రాక నీటిలో మునిగిపోయాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు.

10 year old boy died in velmal
ఈతకు వెళ్లి చెరువులో పడి పదేళ్ల బాలుడి మృతి
author img

By

Published : May 8, 2020, 1:19 PM IST

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రానికి చెందిన అంజి అనే బాలుడు వెల్మల్​లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మేనమామ సతీష్​తో కలిసి ఈతకు వెళ్లారు. ఇద్దరూ చెరువులో దిగి స్నానం చేస్తుండగా... దురదృష్టవశాత్తు అంజి నీటిలోనే మునిగిపోయాడు.

సతీష్ అంజిని కాపాడేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ... విఫలమయ్యాడు. అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహం కోసం గాలించగా... ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమయింది. అంజి మృతితో గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.