శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల అధికారులు ప్రాజెక్టులోని 40 గేట్లను ఎత్తి... నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు 96,577 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 1.50 లక్షల క్యుసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... 1090.60 అడుగులకు చేరుకుంది.