ETV Bharat / state

4 Years Girl Died By Touching Refrigerator in Super Market : సూపర్ మార్కెట్‌లో ఫ్రిజ్ ముట్టుకోగానే కరెంట్ షాక్​తో చిన్నారి మృతి

4 Years Girl Died By Touching Shop Refrigerator : నిజామాబాద్​ జిల్లా నందిపేటలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో విద్యుదాఘాతంతో చిన్నారి మృతి చెందింది. తండ్రితో సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన రిషిత ఫ్రిజ్‌ ముట్టుకోగానే కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పాప మృతికి కారణమైన సూపర్ మార్కెట్ ఎదుట మృతదేహంతో బైఠాయించారు.

4 Years Girl Died By Touching Shop Refrigerator

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 5:29 PM IST

Updated : Oct 2, 2023, 7:23 PM IST

4 Years Girl Died By Touching Shop Refrigerator : ఈ మధ్య కాలంలో కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందుతున్న ఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్షమో లేదా ఇతరులదో కానీ అభం శుభం తెలియని చిన్నారులు కానరాని లోకాలకు వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రితో సరుకులు కొనడానికి వెళ్లింది ఆ చిన్నారి. అక్కడున్న ఫ్రిజ్‌ తలుపు ముట్టుకుంది అంతే.. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన రాజశేఖర్‌, సంయుక్తలకు ఇద్దరు పిల్లలు. వారికి రిషిత రెండో సంతానం. నందిపేటలోని వారి బంధువుల ఇంటికి పూజ కార్యక్రమానికి వెళ్లారు. వీరు పూజకు సామాగ్రి కోసం దగ్గర్లో ఉన్న ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. రాజశేఖర్‌తో పాటు సామాగ్రి కోసం పూజను కూడా సరదాగా తీసుకెళ్లాడు.

4 Years Girl Died By Touching Shop Refrigerator : తండ్రి రిషిత కోసం ఏదైనా తాగడానికి తీసుకుందామని ఫ్రిజ్‌ వద్దకు వెళ్లారు. అందులో నుంచి వస్తువులు చూస్తున్నారు. అటువైపుగా వస్తున్న పాపను రాజశేఖర్ గమనించలేదు. రిషిత అక్కడే ఉన్న మరో ఫ్రిజ్‌ దగ్గరకు వెళ్లి డోర్‌ ముట్టుకోవంతో కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తండ్రి గమనించడంతో వెంటనే కుమార్తెను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

"ఏడున్నర ఆ సమయంలో షాపుకు వచ్చాము. కావాల్సిన సామాగ్రి అంతా తీసుకున్నాం. ఏదైనా తాగడానికి తీసుకుంటాం అని ఫ్రిజ్‌ దగ్గరకు వెళ్లాను.. నా వెనకాలే పాప వచ్చింది. నేను ఒక ఫ్రిజ్ దగ్గర ఉన్నాను పాప ఇంకో ఫ్రిజ్‌ డోర్‌ పట్టుకోగానే షాక్‌ తగిలింది. అసలేమైందో మాకు అర్థం కాలేదు.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. నాలుగు ఆసుపత్రులకు తీసుకెళ్లాము ఎక్కడికి వెళ్లినా పల్స్‌ లేదు అన్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందిందని తెలిపారు." - రాజశేఖర్‌, రిషిత తండ్రి

కరెంట్‌ షాక్‌ కారణంగానే తమ పాప మృతి చెందిందని ఆగ్రహించిన రిషిత తల్లిదండ్రులు , బంధువులు సూపర్ మార్కెట్‌ ఎదుట మృతదేహంతో భైఠాయించారు. షాప్‌వారి నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే పాప మృతి చెందిందంటూ ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరి ధర్నాతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు... రిషిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

4 Years Girl Died By Touching Shop Refrigerator సూపర్ మార్కెట్‌లో ఫ్రిజ్ ముట్టుకోగానే కరెంట్ షాక్​తో చిన్నారి మృతి

బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి మృతి.. ఉదయం నుంచి అందులోనే..

live video on Car Accident At LB Nagar : డ్రైవర్​ నిర్లక్ష్యం.. కారు డోర్​ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి

Girl falls in nala: పాల ప్యాకెట్​ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి.. సీసీ టీవీలో దృశ్యాలు

Last Updated : Oct 2, 2023, 7:23 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.