BRS Leader Raped A 13 Year Old Girl In Nizamabad : ఒకవైపు చూస్తే పేదరికం.. మరోవైపు చూస్తే తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి అనారోగ్యంతో మంచాన పడింది. ఇంకోపక్క అన్నదమ్ములు కాని అక్కచెల్లెళ్లుగానీ ఎవరూ లేరు. ఈ పరిస్థితుల్లోనే చదువుకుంటూ 13 సంవత్సరాల బాలిక.. తల్లికి తోడుగా ఉంటూ అన్నీతానై తల్లికి సహాయంగా ఉంటుంది. అలా సాగిపోతున్న చిన్నారి ప్రయాణంలోకి అనుకోని అపాయం ఎదురైంది. అధికార పార్టీకి చెందిన నేత చేతికి చిక్కి.. అతి క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఓ కాలనీలో చోటుచేసుకుంది. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించారు. అలాగే బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే షకీల్ పరామర్శించి.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Minor Girl Was Raped In Nizamabad : ఈ సందర్భంగా ఎమ్మెల్యే అత్యాచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 13 సంవత్సరాల బాలికను కాలు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా అత్యాచారం చేశారని ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని లా ప్రకారం ఉరితీయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అధికార పార్టీకి చెందిన నేత కొత్తపల్లి రవీందర్, అతనికి సహకరించిన నిందితుడి అన్న రాధాకృష్ణను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు.
- Attacked with a knife for refusing love: ప్రేమను నిరాకరించిందనే కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి
- Youngman Molested Minor Girl in Hyderabad : 'మైనర్' ప్రేమ పెళ్లిలో ఎన్నెన్ని మలుపులో..
13 Years Girl Raped In Nizamabad : వారిద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని.. రాధాకృష్ణ వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించడం జరిగిందని ఆరోపించారు. అతనిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని.. చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాలికది పేద కుటుంబం కావడం వల్ల తనకు చెందిన ట్రస్ట్ ద్వారా ప్రతి నెల రూ.6000 సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఆడబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. తండ్రిలేని పిల్ల.. తల్లికి అనార్యోగ్యం ఒక్కటే పాప. ఇలాంటి బాలికను అంత క్రూరంగా అత్యాచారం చేయడం.. బాధాకరమైన విషయం అని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు.
విచారిస్తున్న పోలీసులు : బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రవీందర్‌లో పాటు అతని సోదరుడు బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలికను ఎమ్మెల్యే సతీమణి వైద్య పరీక్షల నిమిత్తం.. తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత.. వివరాలు బయటకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి :