ETV Bharat / state

సొంతూరికి అండగా.. మిత్రులు ఉండగా.. - సొంతూరి ప్రజలకు ముథోల్​ యువత చేయూత

లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ సొంతూరి ప్రజలకు అండగా తమ వంతు సాయం చేయడాని ఓ మిత్రబృందం సభ్యులు ముందుకొచ్చారు. నిర్మల్​ ముథోలోని 100 మంది నిరుపేద కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.

youth of mudhol nirmal distributed groceries to the poor
సొంతూరికి అండగా.. మిత్రులు ఉండగా..
author img

By

Published : Apr 24, 2020, 10:49 AM IST

నిర్మల్ జిల్లా ముథోలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 1997 - 98 సంవత్సరంలో పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కానీ సొంతూరిపై మమకారంతో.. కరోనా కష్టకాలంలో సొంతూరి ప్రజలకి తమ వంతు సాయం చేయాలనుకున్నారు. మిత్రులందరూ ఏకమై ఊర్లోని 100 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు, కొన్ని రకాల కూరగాయలను అందించి సేవ దృక్పతాన్ని చాటుకున్నారు.

భైంసా డీఎస్పీ నర్సింగరావు, తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, సీఐ అజయ్ బాబు చేతుల మీదుగా వాటిని వితరణ చేశారు. మాకేమి పట్టిందిలే అనుకోకుండా సొంతఊరికి తమ వంతు సాయం చేయాలనుకుని ముందుకొచ్చిన ఆ మిత్ర బృందాన్ని డీఎస్పీ అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన సూచించారు.

youth of mudhol nirmal distributed groceries to the poor
సొంతూరికి అండగా.. మిత్రులు ఉండగా..

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.