కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించడం వల్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిర్మల్ జిల్లా సోన్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు అన్నారు. వారికి కూరగాయలు పంపిణీ చేసిన శ్రీ ధర్మశాస్త యూత్ సేవలు మరవలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త యూత్ సభ్యులు మణికంఠ, రమేశ్, ప్రశాంత్, సందీప్.. గ్రామస్థులు గుర్రం నారాయణ, గుర్రం రాము, గుర్రం భీమన్న, మేకల అశోక్, బర్మ రమణ, చింతల ప్రవీణ్, బొజ్జ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.