నిర్మల్ జిల్లాలోని ఎడ్బీడ్ గ్రామంలో మల్లన్న జాతర వైభవంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా హిమాయత్‌నగర్‌కు చెందిన బాలిక కుస్తీ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇవీచూడండి: 'తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికం'