హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోరారు. దాదాపు 300 వరకు మొక్కలు నాటాలని తెలిపారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రజలతో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం భైంసా పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వైరల్: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా