White buffalo calf born: సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి. కానీ నిర్మల్ జిల్లాలో ఓ గేదెకు తెల్లటి దూడ జన్మించటం... అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. కుభీర్ మండలంలోని 'పార్డి-కె' గ్రామానికి చెందిన శాహేన్‌రెడ్డి అనే రైతుకు చెందిన గేదె మూడ్రోజుల క్రితం దూడకు జన్మనిచ్చింది.
ఆరు సంవత్సరాల క్రితం ఈ గేదెను కొన్నాం. రెండు సార్లు దీనికి నలుపు రంగులో దూడలు జన్మించాయి. కానీ ఈ సారి తెల్లగా పుట్టేసరికి గేదెకు ఆవు దూడ పుట్టిందా అని అనుమానం వచ్చింది. -శాహేన్ రెడ్డి, రైతు, పార్డి కె
ఇదంతా బాగానే ఉన్నా.. ఆ గేదె దూడ తెల్లగా పుట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడటానికి అచ్చం లేగదూడలా ఉండటంతో గ్రామస్థులు చూడటానికి తరలివస్తున్నారు. ఆ దూడను చూస్తుంటే గేదెకు ఆవుదూడ పట్టిందా... అని అనిపిస్తోంది. జన్యులోపం(genetical disorder issues) కారణంగానే అరుదుగా గేదెలకు తెల్లదూడలు పుడతాయని పశువైద్యులు చెబుతున్నారు.
రైతు మమ్మల్ని సంప్రదించగానే.. దూడను పరిశీలించాం. ఆల్భినిజమ్ డెఫిషియెన్సీ ఆఫ్ మెలనిన్ పిగ్మెంటేషన్ ప్రభావంతో జన్యుపరమైన లోపాలు తలెత్తి గేదె దూడలకు చర్మం తెల్లగా వచ్చే అవకాశం ఉంది. ఇలా తెల్లగా పుట్టడం చాలా అరుదు. వీటికి సూర్యరశ్మి అధికంగా తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. -సర్వోత్తమ్, పశు వైద్యాధికారి
ఇదీ చదవండి: Man sets his bike on fire Adilabad : 'ఊకె చలాన్ వేస్తుర్రని.. బండి తగులబెట్టిన'
paddy procurement issues: దళారుల అక్రమాలు ఆపేందుకే ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు..!