నిర్మల్ జిల్లా ముథోల్ మేజర్ గ్రామ పంచాయతీ జనాభా దాదాపు 16వేలు. పంచాయతీలో 58 వరకు టూఫేజ్, త్రీఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి. ఇందులో 18 మోటర్లకు... విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ బిల్లులు పెరిగిపోవడమే ఇందుకు కారణం. కొన్ని కాలనీల వాసులు ఈ బోరు మోటర్ల నుంచి వచ్చే నీటినే రోజూ వాడతారు. నిత్యావసరాలతోపాటు తాగునీటి కోసం ఉపయోగించే నీరు రాకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు నీళ్లు వచ్చేలా చూడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: అశ్లీల వీడియోలు చూపించే... ఆ సార్ మాకొద్దు..!