ఇవీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!
విగ్రహ ఏర్పాటులో ఓటు బ్యాంకు రాజకీయాలు - ఎంఐఎం
శివాజీ విగ్రహం ఏర్పాటుకై 1997లోనే పురపాలక సంఘం తీర్మానించిందని కృష్ణా, గోదావరి జలాల కమిటీ భాజపా రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి విగ్రహ ఏర్పాటుకు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
విగ్రహ ఏర్పాటులో ఓటు బ్యాంకు రాజకీయాలు
ఎంఐఎం ఒత్తిడితోనే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని కృష్ణా, గోదావరి జలాల కమిటీ భాజపా రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ ఆరోపించారు. నిర్మల్‌లోని శివాజీచౌక్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుకై 1997లోనే మున్సిపాలిటీ తీర్మానించిందని గుర్తుచేశారు. కేవలం ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జాతీయ రహదారి మధ్యలో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 2007 తర్వాత ఏర్పాటుచేసే వాటికే ఈ నిబంధనలు వర్తిస్తాయని గుర్తించాలన్నారు. ఆదివారం ఉదయం విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహిస్తామన్నారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే హాజరు కావాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!
Intro:Body:Conclusion: