ETV Bharat / state

మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి: విద్యా వాలంటీర్లు

author img

By

Published : Jan 25, 2021, 7:10 PM IST

గత 3సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలకు తాము చేసిన సేవలను గుర్తించాలంటూ నిర్మల్ జిల్లాలోని విద్యా వాలంటీర్లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి తమను రెన్యూవల్ చేయాలని కోరారు.

vidya volunteers asks govt to renew themselves for the 2020-21 academic year in nirmal
తమను విధుల్లోకి తీసుకోండి: విద్యా వాలంటీర్లు

ప్రభుత్వ పాఠశాలల్లో తమను కొనసాగించాలంటూ నిర్మల్ జిల్లాలోని విద్యా వాలంటీర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రాష్ట్ర విద్యావాలంటీర్ల సంఘం నాయకులతో కలిసి.. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

2020-21 విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయడంతో పాటు.. పెండింగ్​లో ఉన్న వేతనాలను చెల్లించాలని విద్యా వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. 3సంవత్సరాల నుంచి తాము చేసిన సేవలను గుర్తించాలంటూ వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యావాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దిగంబర్, ఉపాధ్యక్షులు మధుకర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పాలమూరు ప్రజలను సీఎం మోసం చేస్తున్నారు: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.