నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తల్లి లక్ష్మీబాయి(70), కుమార్తె భారత్ బాయి(50) మృతి చెందారు. దీంతో ఆదివారం ఉదయం వారి ఇంట్లో నుంచి దుర్ఘంధం వస్తుందని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృత దేహాలను చూసి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.
తల్లి లక్ష్మీ బాయి(70), కుమార్తె భారత్ బాయి(50)లు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధణకు వచ్చారు. గ్రామస్థుల సాయంతో వారికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇదీ చూడండి : జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై తండ్రీకొడుకుల దాడి