ETV Bharat / state

సిరాలలో విషాదం: కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి - nirmal district news

ఈత కోసమని క్రషర్​ నీటి కుంటలోకి దిగిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్​ జిల్లాలోని సిరాల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

two child died  in crusher water pond in nirmal district
క్రషర్ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : Jul 8, 2020, 9:40 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామ శివారులో ఉన్న క్రషర్ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం కుంటలోకి దిగి ఇద్దరు చిన్నారులు బద్రి (14), రాజు (13) చనిపోయారు. ఘటనా స్థలాన్ని భైంసా డీఎస్పీ నర్సింగ్​ రావు పరిశీలించారు. గ్రామానికి చెందిన సురేష్ వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామశివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. ఆయనతోపాటు కుమారుడు బద్రి , అతడి స్నేహితుడు రాజు వెళ్లారు.

వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత వ్యవసాయ సామగ్రిని శుభ్రం చేయడానికి పంట పొలం పక్కనే ఉన్న క్రషర్ నీటి కుంటలోకి వెళ్లారు. సురేష్​ సామగ్రి శుభ్రం చేస్తున్న సమయంలో వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆ నీటి కుంటలోకి దిగారు. ఈత రాకపోవడం వల్ల మునిగిపోయారు. చిన్నారుల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు డీఎస్పీ నర్సింగ్​రావు తెలిపారు.

ఇవీ చూడండి: తాగిన మైకంలో భర్తను చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.