తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో ఎందరో రైతులు తమ భూములను కోల్పోయారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (PROF KODANDARAM) పేర్కొన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు కొన్ని నియమ నిబంధనల ప్రకారం... వారికి అటవీ హక్కు పత్రాలు అందించాలని పార్లమెంటులో బిల్లు సైతం ఆమోదించడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పోడు భూములను చట్టవిరుద్దంగా రైతుల నుంచి లాక్కుంటుందని ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో "పోడు రైతు పొలికేక అఖిలపక్ష సదస్సు"కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పోడు భూములపై హక్కులు సాధించుకునేందుకు ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. వచ్చే నెల 5న నిర్వహించే రాస్తారోకో, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన బిల్లులోని కొన్ని నిబంధనల ప్రకారం పోడు భూములను సాగు చేసే రైతులకు అటవీ హక్కు పత్రాలు అందిచాలి. కాని తెరాస ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పోడు భూములను చట్టవిరుద్ధంగా రైతుల నుంచి లాక్కుంటుంది. రాస్తారోకో, నిరసన కార్యక్రమాలతోనే పోడు భూములపై హక్కులు సాధించవచ్చు. నిరసన కార్యక్రమాలతో మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. లేదంటే ప్రభుత్వం మన సమస్యలను గుర్తించదు. అందుకే వచ్చే నెల 5న నిర్వహించే రాస్తారోకో, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అప్పుడే మన సమస్యలను ప్రభుత్వం గుర్తిస్తుంది. -ప్రొఫెసర్ కోదండరాం
ఇదీ చదవండి: Telangana Rains: బీ అలర్ట్.. తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు