నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన హిమజ అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం ఆమెకి పురిటి నొప్పులు రావడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేయగా ఒకే సారి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగబిడ్డ జన్మించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యురాలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధుల కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్