'బైంసా అల్లర్ల విషయంలో జోక్యం చేసుకుంటే.. చంపుతామంటూ' తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు పడకండి రమాదేవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల 12న +923481411535 నంబర్ నుంచి అర్ధరాత్రి సమయంలో వరుసగా 3 సార్లు తనకు కాల్ చేసి.. చంపుతామని బెదిరించినట్లు రమాదేవి చెప్పారు. పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నామంటూ.. భైంసా అల్లర్లు, మైనర్ బాలికపై లైంగిక దాడి విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారన్నారు. దుండగులు.. వాట్సాప్‌కూ పలుమార్లు మెసేజ్‌లు చేసినట్లు చెప్పుకొచ్చారు.
రమాదేవి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఏవరు చేశారనేది విచారణలో తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: 'ఎన్నికల్లో తెరాస అక్రమాలపై విచారణ జరిపించండి'