రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ స్టేడియం నుంచి మంచిర్యాల్ చౌరస్తా వరకు కళాశాల విద్యార్థులతో 2కె రన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు హాజరై, జెండా ఊపి 2కె రన్‌ను ప్రారంభించారు. అనంతరం శివాజి చౌక్‌లో విద్యార్థులు మానవహారం చేపట్టారు.
పోలీసుల అమరవీరుల త్యాగాల ఫలమే నేటి నిర్మల్ జిల్లాలో శాంతి స్థాపన జరిగిందని ఎస్పీ అన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి గుర్తింపు ఆశించకుండా పనిచేయాలన్నారు. అనునిత్యం ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూ.. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందనీ, వారి త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : సెల్‌టవర్ ఎక్కి ఆర్టీసీ కార్మికుల నిరసన