నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రిలో చేపట్టిన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను పరిశీలించారు.
నాణ్యమైన వైద్య సేవలందించాలి..
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.దేవేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రావు, డా.రజిని తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో