ETV Bharat / state

నిర్మల్ చేరుకున్న శ్రీ రామరక్ష మహాపాదయాత్ర

శివ, అయ్యప్ప మాలలు ధరించిన భక్తులు చేపట్టిన శ్రీ రామరక్ష మహాపాదయాత్ర నిర్మల్​కు చేరుకుంది. కాశీ నుంచి తీసుకెళ్తున్న జలాలతో రామేశ్వరంలో శివునికి అభిషేకం జరిపిస్తామని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.

నిర్మల్ చేరుకున్న శ్రీ రామరక్ష మహాపాదయాత్ర
author img

By

Published : Oct 19, 2019, 11:46 PM IST

శివ, అయ్యప్ప మాలలు ధరించిన కొందరు భక్తులు చేపట్టిన శ్రీరామరక్ష మహా పాదయాత్ర శనివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన వినయ్ గురుస్వామి నేతృత్వంలో పది మంది భక్తులు సెప్టెంబర్ 16న కాశీ నుంచి రామేశ్వరం వరకు పాదయాత్ర ప్రారంభించారు. 34 రోజుల అనంతరం అది నిర్మల్ పట్టణానికి చేరుకుంది. స్థానిక అయ్యప్ప సేవా సమితి సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. నందిగుండం దుర్గా మాతా ఆలయంలో స్వాములకు భోజన సదుపాయం కల్పించారు. కాశీ నుంచి గంగా జలాలను తీసుకుని పాదయాత్రగా రామేశ్వరం వరకు తీసుకెళ్తున్నామని వినయ్​ గురుస్వామి తెలిపారు. కాశీ నుంచి తీసుకెళ్తున్న గంగా జలాలతో రామేశ్వరంలో అభిషేకం జరిపిస్తామని అక్కడి నుంచి ఇసుకను తీసుకొని మళ్ళీ కాశీ చేరుకుంటామన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని శివుడిని ప్రార్థిస్తూ ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు.

నిర్మల్ చేరుకున్న శ్రీ రామరక్ష మహాపాదయాత్ర

ఇవీ చూడండి: యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్​ ప్రభావం

Intro:TG_ADB_36_19_KASHI TO RAMESHWARAM_AVB_TS10033..
నిర్మల్ చేరుకున్న శ్రీ రామ రక్ష మహాపాదయాత్ర..
------------------------------------------------------------------
లోకకళ్యాణం కోరుతూ పలువురు శివ , అయ్యప్ప మాలాధారణ చేపట్టిన శ్రీరామ రక్ష మహా పాదయాత్ర శనివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది . నిజామాబాద్ జిల్లా బాన్సువాడ చెందిన వినయ్ గురుస్వామి నేతృత్వంలో పది మంది భక్తులు సెప్టెంబర్ 16న కాశీ నుంచి రామేశ్వరం వరకు పాదయాత్ర ప్రారంభించారు. 34 రోజుల అనంతరం అది నిర్మల్ పట్టణానికి చేరుకుంది. స్థానిక అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం పలికారు. నంది గుండం దుర్గా మాత ఆలయంలో స్వాములకు భోజన సదుపాయం కల్పించారు .ఈ సందర్భంగా గురు స్వామి మాట్లాడుతూ కాశీ నుంచి గంగా జలాలు, శివలింగాన్ని పాదయాత్రగా శబరిమలై, రామేశ్వరం వరకు తీసుకు వెళ్తున్నాము అని తెలిపారు .ఆగిన ప్రతిచోటా శివలింగం నందీశ్వరుల కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు .కాశీ నుంచి తీసుకు వెళ్తున్న గంగా జలాలతో రామేశ్వరంలో అభిషేకం జరిపిస్తామని అక్కడి నుంచి ఇసుకను తీసుకొని మళ్ళీ కాశి చేరుకుంటాము అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని శివుడిని ప్రార్థిస్తూ ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు.
బైట్ ..వినయ్ , గురు స్వామి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.