ETV Bharat / state

MAHABUB GHAT: పర్యాటకుల మదిని దోస్తున్న 'మహబూబ్​ ఘాట్​' అందాలు - telangana latest news

పచ్చని కొండలు.. మధ్య తెల్లని పొగ మంచు.. వాటికి తోడు చిన్న చిన్న వాన చినుకులు... వింటుంటూనే వెళ్లాలనిపిస్తోంది కదూ..! ఊటీని మరిపిస్తున్న ఆ ప్రాంతం ఎక్కడో కాదు.. మన రాష్ట్రంలోనే కనువిందు చేస్తోంది. నిర్మల్ జిల్లాలోని మహబూబ్‌ ఘాట్‌ అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు.

MAHABUB GHAT: పర్యాటకుల మదిని దోస్తున్న 'మహబూబ్​ ఘాట్​' అందాలు

author img

By

Published : Aug 20, 2021, 10:54 PM IST

MAHABUB GHAT: పర్యాటకుల మదిని దోస్తున్న 'మహబూబ్​ ఘాట్​' అందాలు

చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి అందాలు.. ఒంపులు తిరిగిన రహదారి మలుపులు.. నిర్మల్‌ సమీపంలోని మహబూబ్‌ ఘాట్‌ వద్ద కనిపిస్తున్న ఈ దృశ్యాలు అందరి మదినీ దోచుకుంటున్నాయి. అక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

ఆదిలాబాద్‌ వెళ్లే మార్గంలో నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం రాణాపూర్‌ దాటగానే.. మహబూబ్‌ ఘాట్‌ మొదలవుతుంది. కొండల మధ్య దాదాపు 4 కిలో మీటర్లు వంకర్లు తిరుగుతూ కనిపిస్తుంది. రహదారి మార్గమంతా పొగమంచు అలముకోవడంతో ఊటీని తలపిస్తోంది. మహారాష్ట్రలోని విదర్భ సహా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అక్కడి పర్వత ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు కొత్త చిగురుతో మహబూబ్‌ ఘాట్‌ మరింత ఆకర్షణీయంగా మారింది. కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, అక్కడక్కడా లోతైన అగాధాలతో ఆ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే డేంజరస్ స్కైవే- 59ఏళ్ల తర్వాత రీఓపెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.