నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఓ రాగి చెట్టు ఉంది. ఆ వృక్షం పగలంతా ఆకులు లేక ఎండిపోయిన దానిలా కనిపిస్తుంది. సాయంత్రం దాటితే పచ్చగా మారుతుంది. ఎందుకంటే... ఆ చెట్టు రామ చిలుకలకు ఆవాసం..
సూర్యాస్తమయం సమయంలో వేల సంఖ్యలో పక్షలు ఆ చెట్టుపైకి వచ్చేస్తాయి. రాత్రి ఆ చెట్టుపైనే ఉండి.. ఉదయాన్నే వెళ్లిపోతాయి. మళ్లీ ఆ సాయంత్రం వరకు కనబడవు. తిరిగి సాయంత్రం కాగానే వచ్చేస్తాయి. అక్కడ చుట్టు పక్కల ఉండే ప్రజలు సాయంత్రం వాటిని చూస్తూ... ఆస్వాదిస్తుంటారు.
- ఇదీ చదవండి: ప్రారంభమైన ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు