వాహనచోదకులు రహదారి నిబంధనలు తప్పకుండా పాటించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని దిలావర్పూర్ స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదట వాహనచోదకుల వద్ద ధ్రువపత్రాలను పరిశీలించారు.
ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ సూచించారు. వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తమ వద్ద ఉండాలని అన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ.. ఎవరి జాగ్రత్త వారు వహిస్తే.. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని తెలిపారు. మోటర్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని.. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారులు పోలీసులకు సహకరించి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి చేరాలని కోరారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు