ETV Bharat / state

ఇంటి ముంగిట్లోకి ఆర్టీసీ కార్గో సేవలు

కరోనా కాలంలో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి కార్గో సర్వీసు ఊతం ఇచ్చింది. వీటికి ప్రజాదరణ లభిస్తుండటంతో సేవలను మరింత విస్తరించేందుకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేశారు.

ఇంటి ముంగిట్లోకి ఆర్టీసీ కార్గో సేవలు
ఇంటి ముంగిట్లోకి ఆర్టీసీ కార్గో సేవలు
author img

By

Published : Aug 4, 2020, 5:27 PM IST

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారిని ఆకర్షించి... ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా ప్రభావం వల్ల ప్రజా రవాణా ఆశించనంతగా లేకపోవడం వల్ల మొదలు పెట్టిన కార్గోసేవలకు ప్రజాదరణ లభించడం వల్ల దానిని మరింత ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వినియోగదారులను ఆకర్షించేందుకు నేరుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సంస్థ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటుచేశారు. ఓ మినీ బస్సును పార్సిల్, కార్గో సామగ్రిని సేకరించేందుకు సిద్ధం చేశారు. చోదకుడితో పాటు బుకింగ్ క్లర్క్ ఉంటారు. రోజూ జిల్లా కేంద్రంలో ప్రధాన వ్యాపార సముదాయ ప్రాంతాలతో పాటు కాలనీల్లోనూ తిరుగుతారు. ఎవరైనా ప్రయాణ ప్రాంగణం వరకు తమ ప్యాకేజీ, లగేజీలను తీసుకెళ్లి కొరియర్ చేయలేని వ్యక్తులు, వ్యాపారులు ఈ వాహనం వద్దనే నేరుగా బుక్ చేసుకోవచ్చు.

ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 250 గ్రాముల లోపు ఉన్న పార్సిల్​కు రూ.20 ఉండగా... 500 గ్రాముల వరకు రూ.30, వెయ్యి గ్రాములకు రూ. 40 చొప్పున రుసుము చెల్లించాలి. ఇతర రాష్ట్రాలకు 250 గ్రాముల వరకు రూ. 40.. 500 గ్రాముల వరకు రూ.50, వెయ్యి గ్రాములకు రూ 60 చొప్పున చెల్లించాలి. బుక్ చేసే సమయంలో కాకుండా, పార్సిల్​ను డెలివరీ తీసుకునే సమయంలో కూడా రుసుము చెల్లించే అవకాశం కల్పించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.