ETV Bharat / state

ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన.. సబిత వ్యాఖ్యలపై ఫైర్‌

Basara Students Protest : బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు మూడోరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ... మూడ్రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రధాన గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో... రెండో గేటు వద్ద బైఠాయించారు. వర్షం కురుస్తున్నా... గొడుగులు పట్టుకుని ఆందోళన తెలిపారు. మరోవైపు మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. తమవి సిల్లీ డిమాండ్స్‌ అన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రధానమైన 12 సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Basara Students Protest
Basara Students Protest
author img

By

Published : Jun 16, 2022, 11:11 AM IST

Basara Students Protest : సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన... బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎక్కడా తగ్గడం లేదు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ... మూడ్రోజులుగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా నిరనసలు తెలుపుతున్నారు. గొడుగులు పట్టుకుని తమ సమస్యల కోసం పోరాడుతున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రధానమైన 12 సమస్యలను పరిష్కరించాలంటూ... ఆందోళన తెలుపుతున్నారు. ప్రధాన గేటు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో... రెండో గేటు వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమస్యల పరిష్కారం కోరుతూ... మూడ్రోజులుగా విద్యార్థులు ఆందోళన తెలుపుతున్నారు. మరోవైపు ఆందోళన తెలుపవద్దంటూ పలువురు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

RGUKT Students protest : నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ... కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితారెడ్డితో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న 12 డిమాండ్లలో రెండు, మూడు తక్షణమే పరిష్కరిస్తామని, మిగితావి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. ఇందుకు విద్యార్థులు ఒప్పుకోలేదు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సీఎం లేదా మంత్రి కేటీఆర్‌ వచ్చేదాకా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.

వందలమంది విద్యార్థులు 'విజిట్ ఆర్జీయూకేటీ-కన్సిడర్ ఆర్జీయూకేటీ హ్యాష్‌ ట్యాగ్‌లతో వేల ట్వీట్లు చేశారు. విద్యార్థుల ట్వీట్లకు స్పందించిన కేటీఆర్.... సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్యాగ్‌ చేశారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.