ETV Bharat / state

'భూ సంబంధిత కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్​ కోర్టు' - నిర్మల్​ కలెక్టర్​ వార్తలు

భూ సంబంధిత కేసులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రైబ్యునల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు నిర్మల్​ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. తహసీల్దార్​లతో కలెక్టరేట్​లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా తహసీల్దార్ల పరిధిలో ఉన్న పెండింగ్ కోర్టు కేసుల వివరాలను సత్వరమే కార్యాలయానికి పంపాలని కలెక్టర్​ ఆదేశించారు.

nirmal collector, special tribunal court
నిర్మల్​, కలెక్టర్​, ప్రత్యేక ట్రైబ్యునల్​ కోర్టు
author img

By

Published : Jan 17, 2021, 9:03 AM IST

నిర్మల్ జిల్లాలో భూ సంబంధిత కోర్టు కేసులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రైబ్యునల్ కోర్టును ఏర్పాటు చేశామని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. శనివారం.. కలెక్టరేట్​లో ప్రత్యేక ట్రైబ్యునల్ రెవెన్యూ కోర్టు కేసులు, తదితర అంశాలపై తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రైబ్యునల్ రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. మండలాల వారీగా తహసీల్దార్ల పరిధిలో ఉన్న పెండింగ్ కోర్టు కేసుల వివరాలను సత్వరమే కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. రెవెన్యూ ట్రైబ్యునల్ కేసులు, పెండింగ్ మ్యుటేషన్లు, కంపెనీలు, సంస్థలకు పాసుబుక్​లు, ఆధార్ పెండింగ్ కేసులు, సాదాబైనామాల దరఖాస్తులను.. ప్రత్యేక ప్రణాళిక రూపంలో ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, భైంసా ఆర్డీఓ రాజు, తహసీల్దార్లు సుభాష్ చందర్, విశ్వంభర్, ప్రభాకర్, శ్రీకాంత్, నరేందర్, కిరణ్మయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.