నిర్మల్ జిల్లా భైంసా పట్టణం శివారు ప్రాంతం అందమైన ఆహ్లాదకరమైన గుట్టలకు నెలవు. వీటిని చూస్తే ఎవ్వరైనా పరవశించిపోతారు. స్థానికులు ఈ గుట్టలను ఎంతో విలువైనవిగా భావిస్తారు. కానీ కొందరు అక్రమార్కుల ఆగడాల వల్ల ఆ గుట్టల అందం చెడిపోతోంది.
ఎలాంటి అనుమతి లేకుండా కొందరు మొరం లభ్యం అయ్యే ఈ చిన్న చిన్న గుట్టలను అక్రమంగా తవ్వేస్తున్నారు. గుట్టల మధ్యనుంచి వేసిన విద్యుత్ స్తంభాలను కూడా పట్టించుకోకుండా.. మొరం త్రవ్వకాలు జరుపుతూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ అధికారుల, పోలీసుల దృష్టికి వెళ్లింది. దాడులు నిర్వహించారు. 5 జేసీబీలు,6 టిప్పర్లులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :సర్దార్ సరోవర్ ఆనకట్ట సందర్శించిన మోదీ