పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికులకు పింఛన్, కరవుభత్యం ఇవ్వాలని నిర్మల్‌లోని ఆర్టీసీ డిపో ఎదుట విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ధర్నా చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కాలయాపన చేయకుండా పెన్షన్‌తోపాటు డీఏ కూడా ఇవ్వాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్. అయ్యన్న, జిల్లా కార్యదర్శి జీఎస్ నారాయణ డిమాండ్ చేశారు.

విశ్రాంత ఉద్యోగ భాగస్వామికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి. కిషన్, కమిటీ సభ్యులు సుదర్శన్, పొశెట్టి, మధుసూదన్, భీంరెడ్డి, నర్సయ్య, భూమన్న, నరేందర్, మల్లయ్య, పోతన్న, నారాయణ, రమణ, సైదోద్దిన్, సత్యం, ఇస్మాయిల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆదుకోవాల్సిన యాజమాన్యమే.. వాడుకుంది!