ETV Bharat / state

'లాక్​డౌన్​ కారణంగా ఇళ్లలోనే రంజాన్​ వేడుకలు' - LOCK DOWN EFFECTS TO RAMZAN

నిర్మల్​లోని కలెక్టరేట్​లో రంజాన్ ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో కలెక్టర్​ ముషారఫ్​ ఫారూఖీ సమావేశం నిర్వహించారు. లాక్​డౌన్​ నిబంధనల మేరకు రంజాన్ కార్యక్రమాలను ముస్లిం సోదరులు ఇళ్లలోనే నిర్వహించుకోవాలని కలెక్టర్​ సూచించారు.

RAMZAN FESTIVAL PROGRAMS SHOULD BE HELD IN HOUSES ONLY NIRMAL COLLECTOR SAID
'లాక్​డౌన్​ కారణంగా ఇళ్లలోనే రంజాన్​ వేడుకలు'
author img

By

Published : Apr 23, 2020, 8:34 PM IST

త్వరలో రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న దృష్ట్యా... ముస్లింలు సహార్, ఇఫ్తార్, నమాజ్​ ఇంట్లోనే చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో రంజాన్ ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కలెక్టర్​ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యవసర సరుకులు, కూరగాయలు, పాలు, మందులు వారి ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. 12 రోజులుగా జిల్లాలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఇదే తరహాలో ప్రజలు సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.

RAMZAN FESTIVAL PROGRAMS SHOULD BE HELD IN HOUSES ONLY NIRMAL COLLECTOR SAID
'లాక్​డౌన్​ కారణంగా ఇళ్లలోనే రంజాన్​ వేడుకలు'

ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.