ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు పథకం క్రింద మంజూరైన 3 ఎకరాల వ్యవసాయ సాగు భూములకు మొదటి పంట పెట్టుబడి సహాయం అందించారు.
మొదటి పంట పెట్టుబడి సహాయం క్రింద నిర్మల్ నియోజకవర్గంలోని 25మంది మహిళా రైతు లబ్ధిదారులకు 51.23 ఎకరాలకు గాను... 7లక్షల 52వేల 995 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి ఇంద్రకరణ్ పేర్కొన్నారు.
మొదటి పంట పెట్టుబడి సహాయం క్రింద మంజూరైన నగదును పంటల సాగుకు వినియోగించాలని సూచించారు. అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలానాధికారి ముషారఫ్ ఫారూఖీ, జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ అధికారి హన్మాండ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఇదీ చూడండి:ఔషధ రంగంలో అగ్రాసనం.. నవీకరణకు కట్టాలి నడుం